ప్రమోషన్ డబ్బులు కూడా రాబట్టలేని “పుష్ప ది రైజ్”.?

గత ఏడాది పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప కూడా ఒకటి. మరి పుష్ప లో మొదటి భాగంగా వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ కాగా నెక్స్ట్ అయితే ఈ సినిమా ఆదరణతో జస్ట్ కొన్ని రోజులు కితమే గ్రాండ్ గా రష్యా లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా కోసం ఏకంగా చిత్ర యూనిట్ అంతా కూడా రష్యా తరలి వెళ్లడం విశేషం కాగా అక్కడ మీడియాతో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొనడం విశేషం. సరే ఇదంతా బాగానే ఉంది కానీ అక్కడ రిలీజ్ అయ్యాక అక్కడ రెస్పాన్స్ సంగతి ఏంటి అనేది మాత్రం ఇంకా బయటకి రాలేదు.

దీనితో అయితే అక్కడ డిజాస్టరస్ వసూళ్లు ఈ చిత్రం అందుకుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అలాగే మరోపక్క అయితే రష్యా వరకు వెళ్లి చిత్ర యూనిట్ చేసుకున్న ప్రమోషన్స్ డబ్బులు అయినా అందుకుందా లేదా అనే అనుమానం కూడా ఇప్పుడు అందరిలో వస్తుంది.

మొత్తానికి అయితే పుష్ప మాత్రం అక్కడ డిజాస్టర్ అనే చెప్పాలి. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ వర్క్ చేయగా నెక్స్ట్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది అలాగే సమంత స్పెషల్ సాంగ్ చేయగా అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.