పూరి జగన్నాధ్ – పవన్ కళ్యాణ్ కాంబోలో ” జనగణమన ” .?

పూరి జగన్నాధ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా బద్రి. ఈ సినిమా డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కి డెబ్యూ సినిమా. అప్పటికే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని దక్కించుకొని ఉన్నాడు. అలాంటిది ఒక కొత్త దర్శకుడిగా పరిచయం అవుతున్న పూరి జగన్నాధ్ కి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఎలా ఇచ్చాడన్న మాట ఇండస్ట్రీలో పెద్ద సంచలనం అయింది. అయితే పవన్ కళ్యాణ్ టాలెంట్ ని నమ్ముతాడు. అలాగే పూరి జగన్నాధ్ ని నమ్మాడు. అందుకే పూరి జగన్నాధ్ కి ఛాన్స్ ఇచ్చాడు. పూరి జగన్నాధ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన బద్రి సెన్షేషనల్ హిట్ గా నిలిచింది.

Janasena Party:Latest News|Updates|Janasena News|Pawan Kalyan

ఈ సినిమా తో పవర్ స్టార్ ఇమేజ్ అమాంతం పెంచేశాడు పూరి జగన్నాధ్. అలాగే పూరి జగన్నాధ్ కూడా టాలీవుడ్ లో బద్రి తో స్టార్ డైరెక్టర్ గా పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి పూరి జగన్నాధ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో కెమరామాన్ గంగ తో రాంబాబు సినిమా వచ్చి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా వస్తుందని చాలా సార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ మాత్రం రాలేదు.

Will Pawan Take Up Puri Advice?

కాగా తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. అంతేకాదు ఎప్పటి నుంచో జనగణమన టైటిల్ తో సినిమా చేయాలనుకుంటున్న కథ తోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సహా మరో 5 ప్రాజెక్ట్స్ ని కమిటయ్యాడు. మరి పూరి తో సినిమా అంటే ఇప్పుడు అయ్యే పనేనా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా ని పూరి కేవలం 4 నెలలో కంప్లీట్ చేసేస్తాడు. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.