పూరి జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. చార్మీ కూడా అక్కడే ఉంది. లాక్డౌన్ మొదలైన క్షణం నుంచి ఆ ఇద్దరూ అక్కడేఉన్నారు. ఫైటర్ సినిమా కోసం అక్కడికి వెళ్లిన ఆ ఇద్దరూ అటే ఉండిపోయారు. పూరి, ఛార్మీ అక్కడే ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. పూరి తన ఫైటర్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి నెలలో ఫైటర్ సినిమా షూటింగ్‌ను పూరి జగన్నాధ్ శరవేగంగా కానిచ్చాడు. విజయ్ దేవరకొండ, అనన్య పాండేలపై రొమాంటిక్ సీన్స్‌గా తెరకెక్కించాడు. అర్దరాత్రి బైక్ మీద హీరోహీరోయిన్ల రొమాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే ఆ తరువాత లాక్డౌన్ విధించడంతో అంతా మారిపోయింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభించలేదు. ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న ట్రైనింగ్, పెంచిన బాడీ అంతా వృథా అయ్యింది.
జనవరిలో మొదలెట్టనున్న షూటింగ్ కోసం విజయ్ మళ్లీ బాడీని పెంచే పనిలో పడ్డాడు. ఇందు కోసం జిమ్‌లో ఈ రౌడీ హీరో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను విజయ్ షేర్ చేశాడు. విజయ్ కష్టపడుతున్న తీరుపై పూరి స్పందించాడు. దట్స్ మై హీరో.. దట్స్ మై ఫైటర్.. నువ్ నన్ను గర్వంగా ఫీలయ్యేలా చేస్తున్నావ్.. లవ్యూ విజయ్ అంటూ ప్రశంసలు కురిపించేశాడు పూరి జగన్నాథ్. మొత్తానికి రౌడీ వర్కవుట్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.
Beast Mode ON!#VD10 pic.twitter.com/vcf8viyEDH
— Vijay Deverakonda (@TheDeverakonda) December 27, 2020