‘ధమాకా’ సినిమాతో రవితేజ మార్కెట్ ఈ మధ్య బాగా పెరిగింది. ‘వాల్తేర్ వీరయ్య’ అందుకు ఇంకాస్త ఊతమందించింది. ఈ లోపే ‘నరకాసుర’ సినిమాతో మళ్లీ ఢమాల్ అయిపోయింది. అయినా కానీ, ‘టైగర్ నాగేశ్వరరావు’కు బజ్ బాగుంది. ఈ సినిమా బిజినెస్ విషయంలో బోలెడంత ప్రచారం జరుగుతోంది.
బిజినెస్ అంత బాగా జరిగింది. ఇంత బాగా జరిగింది.. అంటూ సరికొత్త ప్రచారం షురూ అయ్యింది ‘టైగర్ నాగేశ్వరరావు’కి. ‘ధమాకా’ ఏదో అలా కలిసొచ్చేసింది కానీ, రవితేజ మార్కెట్‌కి అంత సీను లేదంటూ కొందరు పెదవి విరిచేస్తున్న వైనం మరోవైపు కనిపిస్తోంది.
చూస్తుంటే, రవితేజ సినిమా అంటే అదో బెట్టింగ్ మాదిరి తయారైంది. మెగాస్టార్ చిరంజీవికే ‘భోళా శంకర్’ విషయంలో ఎటువంటి పరిస్థితి ఎదురైందో చూశాం. అలాంటిది మాస్ రాజా రవితేజ విషయంలో.. ఇంకెలా వుండబోతోంది.
అంతా బాగుండి పలితం పాజిటివ్‌గా వస్తే ఫర్వాలేదు. ఏమాత్రం రిజల్ట్ బెడిసికొట్టినా మొదటికే మోసం వస్తుంది. బిజినెస్ పేరు చెప్పి పెంచేస్తున్న హైప్‌కి ఓ వైపు ఆశ పుడుతున్నా.. మరో వైపు రిజల్ట్ విషయం గుర్తు చేసుకుంటే భయం పుడుతోందట రవితేజకీ, ఆయన మేకర్లకీ.! చూడాలి మరి ఏం జరుగుతుందో.!