నాగబాబు నిర్మాతగా రామ్ చరణ్ సినిమా.?

బాబాయ్ నాగబాబు నిర్మాతగా గతంలో రామ్ చరణ్ ఓ సినిమా చేశాడు. అదే ‘ఆరెంజ్’. అప్పట్లో ఆ సినిమా కారణంగా చాలా నష్టాలు వచ్చాయనీ, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాననీ నాగబాబు పలు సందర్భాల్లో చెప్పారు.

‘ఆరెంజ్’ సినిమా నష్టాల నుంచి నాగబాబుని గట్టెక్కించేందుకోసమే పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా చేశాడట. అదే పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ మధ్య గ్యాప్ రావడానికి కారణమైందనీ, ఆ కారణంగానే ఇద్దరూ విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనీ అంటుంటారు.

ఆ సంగతి పక్కన పెడితే, చాలాకాలం తర్వాత నాగబాబు మళ్ళీ పూర్తిస్థాయి నిర్మాతగా మారబోతున్నారట. అదీ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాతోనట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. నాగబాబు పేరుకే నిర్మాత, నిర్మాణ వ్యవహారాలన్నీ నిమారిక చూసుకోనుందని సమాచారమ్.

పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. అయితే, నాగబాబుతో ఇంకోసారి సినిమా చేసి ‘ఆరెంజ్’ లాంటి విమర్శలు ఎదుర్కోవడం అవసరమా.. అని చరణ్ ఆలోచించకుండా వుంటాడా.!