Naga Vamsi: గత సినిమాలు మైమరించేలా త్రివికమ్ర్‌, అల్లుఅర్జున్‌ సినిమా: నాగవంశీ

వివాదాల సంగతెలావున్నా.. కెరీర్‌ పరంగా మాత్రం గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్‌. ఆయన సృష్టించబోయే రికార్డే ప్రస్తుత మూవీ మేకర్లందరి టార్గెట్‌ అయ్యేలా ఉంది. ఏదేమైనా ‘పుష్ప 2’తో దేశం మొత్తం తనపైపు చూసేలా చేశారు బన్నీ. ఆయన చేయబోయే సినిమాపై కూడా అంచనాలు ఇప్పుడు భారీ స్థాయిలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో తన తాజా ప్రాజెక్ట్‌ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు బన్నీ.

కాగా, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది? రిలీజ్‌ ఎప్పుడు? ఇవి ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు. వీటికి ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవలే సమాధానమిచ్చారు. త్వరలోనే బన్నీ, త్రివిక్రమ్‌ కూర్చుని పాత్ర గెటప్‌, సినిమా సెటప్‌ విషయాలు చర్చిస్తారు. 2025 మధ్యలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. 2026 చివర్లో రిలీజ్‌ చేస్తాం. మారిన బన్నీ ఇమేజ్‌ దృష్ట్యా.. పానిండియా స్థాయిలో సినిమా ఉంటుంది. బన్నీ, త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన గత చిత్రాలను మరిపించేలా అద్భుతమైన కథతో ఈ సినిమాను నిర్మించనున్నాం’ అని తెలిపారు.