సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ సీక్వెల్ ప్లాన్ చేసిన నిర్మాత సి.కళ్యాణ్ ?

c.kalyan is planning to sequel of satyadev bluff master movie

హీరో సత్యదేవ్ ఎక్కువగా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ పాత్రలను పోషించటానికి ఇష్టపడతాడు.కెరీర్ మొదట్లో సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా చేసిన ఈ నటుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతి లక్ష్మిలో ప్రధాన పాత్రను పోషించడం ద్వారా అతనికి పరిశ్రమలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా,గణేష్ పట్టాబి దర్శకత్వం వహించి, రమేష్ పిళ్ళై నిర్మించిన ‘బ్లఫ్ మాస్టర్’ ‌మూవీ తో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీ తమిళ యాక్షన్-డ్రామా చిత్రం ‘సతురంగ వెట్టైకి’ రీమేక్. తెలుగులో ఈ మూవీ ఫర్వాలేదనిపించింది.

c.kalyan is planning to sequel of satyadev bluff master movie
producer c.kalyan is planning to make sequel of satyadev bluff master movie

‘ కంచరపాలెం’ మూవీ దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో ఉమా మహేశ్వర రావు పాత్రలో సత్యదేవ్‌ తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు.ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో గురించి ఒక వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.

‘బ్లఫ్ మాస్టర్’ దర్శకుడు గణేష్ పట్టాబి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కొత్త మూవీ రాబోతున్నట్లుగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించాడు. అయితే ఈ మూవీ బ్లఫ్ మాస్టర్ మూవీ కి సీక్వెల్ అయి ఉంటుందని గట్టిగా టాక్ వినిపిస్తుంది ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ మూవీకి మాతృక అయిన’సతురంగ వెట్టై’ మూవీకి సీక్వెల్ వచ్చేసింది.

కాబట్టి ఈ కాంబోలో వచ్చే మూవీ అదే అయి ఉంటుందని టాక్. కానీ నిర్మాత సి. కళ్యాణ్ మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు.ప్రస్తుతానికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ కొత్త మూవీ ‘తిమ్మరుసు’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా సత్యదేవ్ పక్కన నటిస్తిస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్దమైనారు.