కార్తికేయ 2 పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత అల్లు అరవింద్.. అదిరిపోయే రెస్పాన్స్ అంటూ?

దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్లను రాబడుతూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ కావడంతో ఈ సినిమా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు వంటి వాళ్లు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ… ముందుగా కార్తికేయ2 చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇకపోతే ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన మొదటి రోజు తక్కువ కలెక్షన్లను రాబట్టింది అయితే ఈ సినిమా స్లోగా ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రస్తుతం కోట్ల రూపాయల కలెక్షన్లను రాబడుతుంది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమా తరహాలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అల్లు అరవింద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడు కార్తికేయ 2 హిందీలో ఇరగదీస్తోందని ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలనీ, ఇలాంటి సినిమాలు మంచి ఆదరణ పొందాలని ఈ సందర్భంగా అల్లు అరవింద్ వెల్లడించారు. ఇక అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలను నిఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.