ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతోంది. ఇండియా నుంచి హాలీవుడ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకునే దిశగా ఆమె తన జర్నీ కొనసాగిస్తుంది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఫ్యాషన్ ఈవెంట్స్ లో కూడా ప్రియాంకా చోప్రా పార్టిసిపేట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళిన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంకా చోప్రా తన చిన్ననాటి జ్ఞాపకాలని పంచుకున్నారు. తన తండ్రి అశోక్ చోప్రా చాలా క్రమశిక్షణతో వ్యవహరించేవారని చెప్పింది.
ఈ సందర్భంగా చిన్న వయస్సులో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు. తనకి 12 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు హయ్యర్ స్టడీస్ కోసం తన తండ్రి అమెరికాకి పంపించారు. కొంతకాలానికే అక్కడి కల్చర్, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని నాకు అలవాటు అయిపోయాయి. నా ఆహార్యం కూడా పూర్తిగా మారిపోయింది. హెయిర్ స్టైల్ కూడా మారిపోయింది.
నాలుగేళ్ల తర్వాత ఇండియా వచ్చాను స్థానికంగా ఉండే ఒక స్కూల్ లో నన్ను చేర్చారు. అయితే ఒక రోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయంలో కొంతమంది అబ్బాయిలు నా వెంట పడి ఇంటి వరకు వచ్చేశారు. ఓ అబ్బాయి ఓ రోజు రాత్రి గోడ దూకి నా బాల్కనీలోకి ప్రవేశించాడు. దీంతో నేను భయపడి నాన్న దగ్గరకి వెళ్లి దాక్కున్న. ఆ ఘటన తర్వాత నా తండ్రి కొన్ని రూల్స్ పెట్టారు.
ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్స్ లానే ఉండాలి. అమెరికాలో ఉన్నట్లు ఇక్కడ ఉంటే కుదరదు అని ఖచ్చితంగా చెప్పారు. క్రమశిక్షణ అవసరం అని సూచించారు. ఇక ఆ రోజు నుంచి తన ఆలోచన కూడా మారిపోయింది. మనం ఉన్న ప్రాంతం బట్టి మన అలవాట్లు, రూపం ఉండాలనేది నిర్ణయించుకున్నా అని ప్రియాంకా చోప్రా పంచుకున్నారు.