Priyamani: ఒకప్పుడు ఒక సినిమా గురించో, హీరో లేదా హీరోయిన్ గురించో కామెంట్ చేయాలంటే కాస్త ఆలోచించే వారు. అప్పట్లో సామాజిక మాధ్యమాలు కూడా లేవు కాబట్టి లేని పోని పుకార్ల ప్రచారం కూడా తక్కువే. కానీ ఈ రోజుల్లో మాత్రం అంతా మారిపోయింది. ఒక విషయం తెలిస్తే చాలు, అది చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అది నిజమా, కదా అని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు విమర్శించడం, ప్రచారం చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇక సెలబ్రెటీల గురించి చెప్పాలంటే అంతే సరి. వాళ్లకు సంబందించిన చిన్న విషయం ఐనా సరే ఇలా నెట్లో పెడ్తే, అలా వైరల్ అవుతోంది. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, లేదంటే ప్రొఫెషనల్ గా ఐనా కావచ్చు. అది మామూలుగా ఉంటే పర్లేదు. కానీ కొందరు మితిమీరి చేసే పోస్టులు, కామెంట్స్ చూస్తే ఎవరికైనా చిరాకు రాక తప్పదు.
ఇక ఇదే అంశంపై సినీ నటి ప్రియమణి ఘాటుగా స్పందించింది. చాలా మంది సోషల్ మీడియాలో ఏది అనాలనిపిస్తే అది అనేసే హక్కు ఉందని ఫీలవుతారు. నిజానికి నా మీద వచ్చే మీమ్స్ చూసి నవ్వుకునే దాన్ని, కానీ కొందరు హద్దు మీరి చేసే కామెంట్స్ చూసి భరించలేక పోయేదాన్ని అని ఆమె అన్నారు. అలాంటి వాళ్ళను వెంటనే బ్లాక్ చేసి దాన్ని అని, ఎందుకంటే సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదు కదా అంటూ ప్రియమణి చెప్పుకొచ్చారు. అభిమానులు తనను ఇష్టపడినా, ఇష్ట పడకపోయినా పర్వాలేదు అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
మీరు పెద్ద పెద్ద వర్కవుట్స్ చేయాలని తాను చెప్పనని, ప్లస్ సైజులో ఉన్నా పర్వాలేదు అంటూ ప్రియమణి అన్నారు. కాకపోతే ఖాళీగా ఉండి ఫోన్ చూసే బదులు మనకు ఏది అవసరమో అది చేస్తే బాగుంటుంది అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు కోసం చిన్న చిన్న వర్కవుట్స్ లేదా ఇంటి పనులు చేసినా సరిపోతుంది అంటూ ప్రియమణి తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.