గుర్తుపట్టలేని విధంగా వెంకీ హీరోయిన్.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చూడాలని ఉంది సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సౌందర్య మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆమె తో పాటు అంజలా జవేరి కూడా ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అంజలా జవేరి, చిరంజీవి మధ్య నడిచే ట్రైన్ లవ్ స్టొరీ చూడాలని ఉంది మూవీకి ప్రధాన ఆకర్షణ. అలాగే అదే పాయింట్ చుట్టూ ఈ మూవీ కథ కూడా తిరుగుతూ ఉంటుంది.

ఇక ఈ మూవీ కంటే ముందుగా ఆమె ప్రేమించుకుందా రా సినిమాలో వెంకటేష్ కి జోడీగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే రెండో సినిమాగా వచ్చిన చూడాలని ఉంది సూపర్ హిట్ అయ్యింది. వరుస రెండు హిట్స్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయిన ఈ అమ్మడు తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలలో నటించింది. రావోయి చందమామ సినిమాలో నాగార్జునకి జోడీగా, మరల దేవీపుత్రుడు సినిమాలో వెంకటేష్ కి జోడీగా అంజలా జవేరి నటించింది.

అయితే హిందీలో అవకాశాలు పెరగడంతో మరల టాలీవుడ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మడు నటుడు తరుణ్ అరోరాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తరుణ్ అరోరా తెలుగులో స్టార్ విలన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడుస ఇనిమాలో అతను విలన్ గా నటించాడు. అలాగే స్టార్ హీరోల చిత్రాలలో మెయిన్ విలన్ గా మెప్పించాడు. అతన్ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిన అంజలా జవేరి చివరిగా తెలుగులో శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించింది.

మంచి పాత్రలు లభిస్తే తెలుగులో నటించడానికి ఆమె సిద్ధంగా ఉందని గతంలో ఓ సారి ఆమె భర్త మీడియాకి క్లారిటీ ఇచ్చాడు. అయితే పెళ్లి తర్వాత అంజలా జవేరి వయస్సు పెరగడంతో కాస్త ఆ చాయలు మొహంలో కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. వేలంటైన్స్ డే సందర్భంగా భార్య అంజలాజావేరితో కలిసి తీసుకున్న వీడియోని తరుణ్ అరోరా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉందని చెప్పాలి.