కార్తీకదీపం వంటలక్కకు ఇష్టమైన నటుడు అతడే.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్

premi viswanath about his favorite hero

కార్తీకదీపం సీరియల్ గురించి అందులో వంటలక్కగా, దీపగా అదరగొడుతున్న ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య ప్రేమీ విశ్వనాథ్ బుల్లితెరపై కొత్త కోణంలో కనిపిస్తోంది. బుల్లితెరపై పలు షోలు, మీడియా ముందుకు రావడం, యాడ్స్‌లొనూ కనిపిస్తు దుమ్ములేపుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ ప్రేమీ విశ్వనాథ్ దూసుకుపోతోంది. అయితే తాజాగా తనకు ఇష్టమైన హీరో అంటూ ఓ పోస్ట్ చేసింది.

premi viswanath about his favorite hero
premi viswanath about his favorite hero

హీరో సుమంత్ బర్త్ డే నేడు. ఈ సందర్బంగా ఆయన నటిస్తోన్న కొత్త సినిమా అనగనగా ఒక రౌడీ పోస్టర్‌ను ప్రేమీ విశ్వనాథ్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా వంటలక్క చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ యాక్టర్ సుమంత్ అక్కినేని.. మీరు ఇలానే అంద‌రినీ సంతోష‌ప‌రుస్తూ.. మరెన్నో మంచి చిత్రాలతో అవార్డుల‌ను సొంతం చేసుకోవాలి.. హ్యాపీ బ‌ర్త్‌డే’ అంటూ విషెష్ అందించింది ప్రేమి విశ్వనాథ్.

అయితే వంటలక్క ఇలా ప్రత్యేకంగా పోస్ట్ చేయడంపై అందరూ ఆశ్చర్యపోతోన్నారు. కొంపదీసి వంటలక్క ఆ సినిమాలో నటిస్తుందా? ఏంటి అనే అనుమానం అందరిలోనూ వచ్చింది. మొత్తానికి ప్రేమీ విశ్వనాథ్ తనకు ఇష్టమైన అభిమాన నటుడు అంటూ సుమంత్‌ పేరు చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ మధ్యే ప్రేమీ నటించిన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు యాడ్ తెగ వైరల్ అయింది.