ఆ విషయంలో ఎన్టీఆర్ కన్నా ప్రణతి బెటర్.. వైరల్ అవుతున్న కామెంట్స్…?

NTR about Jayaprakash Reddy

నందమూరి తారక రామారావు వారసుడిగా తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. నందమూరి కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ మరి ఏ ఇతర హీరోకి లేదు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా హీరో గా మంచి గుర్తింపు పొందాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కుటుంబం విషయానికి వస్తే… లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని ఎన్టీఆర్ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ బెస్ట్ కపుల్స్ గా అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రణతి కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ సినిమాలు మాత్రం జోక్యం చేసుకోదు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి తెలుస్తోంది.

అయితే ఫ్యాషన్ విషయంలో మాత్రం ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ కన్నా బెటర్ అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను చూసిన నెటిజన్స్ స్టైల్ విషయంలో మాత్రం లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తుండటం గమనార్హం. తారక్, లక్ష్మీ ప్రణతి కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజగా జపాన్ లో సందడి చేసిన ఈ జంట అక్కడ వెకేషన్ కి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.