మాటలు చెప్పడం కాదు చేసి చూపించాలి… మా అధ్యక్షుడి పనితీరుపై ప్రకాష్ రాజ్ కామెంట్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న నటుడు మంచు విష్ణు గత ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది నటుడు ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల బరిలో దిగి నువ్వా నేనా అనేలా పోటీపడ్డారు. ఈ పోటీలో చివరకు మంచు విష్ణు మా అధ్యక్షత పదవిని కైవసం చేసుకున్నారు. ఇకపోతే ఈయన మా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయింది.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఆయనకు మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా మా అధ్యక్షుడిగా విష్ణు పనితీరు గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురవడంతో ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. విష్ణు మా అధ్యక్షుడిగా గత ఏడాది బాధ్యతలను తీసుకున్నారు. ఇంకా మరో ఏడాది వరకు అతను మా అధ్యక్షుడిగా కొనసాగుతారు అయితే ఆయన ఇప్పటివరకు 90 శాతం పనులను పూర్తి చేశానని చెబుతున్నారు.

ఇలా మాటల్లో చెప్పడం కాదు చేతలలో చేసి చూపించాలి ఇంకా ఏడాది పాటు కొనసాగుతారు కనుక ఆయన ఎలాంటి కార్యక్రమాలను చేస్తారో వేచి చూద్దామంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.ఇకపోతే వచ్చే మా అధ్యక్షత పదవి ఎన్నికలలో మరోసారి మీరు పోటీ చేయనున్నారా అంటూ ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ప్రకాష్ సమాధానం చెబుతూ ఇంకా ఎన్నికలకు ఏడాది పాటు సమయం ఉంది ప్రస్తుతానికైతే ఏం ఆలోచించలేదు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు.