వరుస పరాజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను ఓకే చేసుకున్నారు. వీరిద్దరి కలయికలో ‘సింహ, లెజెండ్’ లాంటి సినిమాలు వచ్చి ఉన్నా కూడ ఈ చిత్రం సెట్ కావడానికి ఎక్కువ సమయం పట్టింది. సినిమా అనౌన్స్ అయినప్పటికీ సెట్స్ మీదకు వెళ్ళడానికి, షూటింగ్ ముగించుకోవడానికి బాగా టైమ్ తీసుకుంది. బాలయ్య గత సినిమాలు వేటికీ ఇంతలా ఆలస్యం జరగలేదు. ఇక ఈ సినిమాను వెంటాడిన పెద్ద సమస్యల్లో హీరోయిన్ ఒకరు. బాలయ్యకు జోడీగా హీరోయిన్ అంత ఈజీగా సెట్ కాలేదు.
సీనియర్ హీరోయిన్లు అందరితోనూ ఆయన నటించి ఉండటంతో కిందా మీదా పది ఆలోచించిన బోయపాటి ప్రగ్యాజైశ్వాల్ ను తీసుకొచ్చారు. లాక్ డౌన్ మూలంగా సినిమాలేవీ లేకపోవడం వలన ప్రగ్యా కూడ ఎగిరి గంతేసి సినిమాకు ఓకే చెప్పేసింది. అంతేకాదు బాలయ్యను తెగ పొగిడేస్తోంది ఈమె. సినిమా పట్ల బాలకృష్ణకు ఉన్న ప్యాషన్ సామాన్యమైంది కాదని, చెప్పుకొచ్చిన ఆమె బాలయ్యకు పవర్ హౌస్ అనే బిరుదును కూడ ఇచ్చేసింది. సినిమా యూనిట్ మొత్తాన్ని బాలకృష్ణగారి ఉత్సాహమే నడిపించిందని ఆయన మీద పొగడ్తల వర్షం కురిపించేస్తోంది.