ప్రభుదేవా దర్శకత్వంలో రామ్ చరణ్.?

ప్రభుదేవా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా ఓకే చేశారనీ తెలుస్తోంది. రీసెంట్‌గా రామ్ చరణ్‌కి ఓ స్టోరీ లైన్ చెప్పాడట ప్రభుదేవా. ఆ స్టోరీ చరణ్‌కి బాగా నచ్చిందట. ఖచ్చితంగా సినిమా చేద్దామని చెప్పాడట.

అయితే, ప్రస్తుతం రామ్ చరణ్ వద్ద డేట్స్ అస్సలు ఖాళీ లేవు. శంకర్ సినిమా సెట్స్‌పై వుంది. అలాగే, మరో రెండు ప్రాజెక్టులు ఆల్రెడీ కన్‌ఫామ్ అయ్యి రేపో మాపో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీగా వున్నాయ్.

సో, ఈ సిట్యువేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ అంటే, ఇప్పట్లో జరిగే పని కాదు. కానీ, ప్రభుదేవాకి మాటిచ్చాడట. చరణ్ మాటిచ్చాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే కాస్త టైమ్ పడుతుందంతే. గతంలో మెగాస్టార్ చిరంజీవితో ప్రభుదేవా ‘శంకర్‌దాదా జిందాబాద్’ సినిమా తెరకెక్కించాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ సినిమా డిజాస్టర్ ఖాతాలో పడిపోయింది.

సో, అలా మెగా డ్రీమ్ శాటిస్‌పై చేసుకోలేకపోయాడు ప్రభుదేవా. ఆ లోటును తనయుడితో తీర్చుకోవాలనుకుంటున్నాడట. చరణ్‌తో ఓ మంచి సినిమా తీసి, సూపర్ హిట్టు కొట్టి మెగాస్టార్‌కి ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నాడట ప్రభుదేవా. చూడాలి మరి, ఇది ఎప్పటికి జరుగుతుందో.