ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల బడ్జెట్ కంటే తీసుకునే రెమ్యూనరేషనే ఎక్కువట ..?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలవబోతుందట. మొత్తంగా డిసెంబర్ వరకు ఈ సినిమాని ప్రభాస్ కంప్లీట్ చేయబోతున్నాడు.

ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించబోయో భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ లో నటించబోతున్నాడు. ఈ సినిమా 2021 జనవరి నుంచి సెట్స్ మీదై వెళ్ళబోతోంది. ప్రభాస్ రాముడిగా సైఫ్ అలీఖాన్ లంకేష్ గా ఇప్పటి వరకు దర్శకుడు అధికారకంగా పోస్టర్స్ తో వెల్లడించాడు. ఇక త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ తో సహా ఇతర పాత్రలని పరిచయం చేయబోతున్నారట.

ఇక ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 21వ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నికల్ టీం తో నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుణే నటించనుంది.

కాగా ‘రాధే శ్యామ్’ దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో నిర్మించే సినిమాకి దాదాపు 500 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్టు సమాచారం. ఇక ఆదిపురుష్ సినిమాని 750 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ముందు నుంచి ప్రచారం అవుతోంది. ఇంకా ఈ బడ్జెట్ పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఈ మూడు సినిమాల బడ్జెట్ కంటే ప్రభాస్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఎక్కువని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం రెమ్యూనరేషన్ తో పాటు లాభాలలో వాటా కూడా తీసుకోబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు.