Kannappa: ప్రభాస్ పారితోషకం: “ఈ మాట మరోసారి ఎత్తితే విష్ణును చంపేస్తా!”

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అరగంటపాటు కనిపించనుండగా, సినిమా బిజినెస్‌లో ఇది ఓ ప్రధాన ఆకర్షణగా మారింది. అయితే, ప్రభాస్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్న విషయంలో దర్శకనిర్మాత మంచు విష్ణు తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రెమ్యూనరేషన్ ఇవ్వాలని మళ్లీ మళ్లీ ప్రయత్నించిన విష్ణుకు ప్రభాస్ ఎప్పుడూ “తర్వాత చూద్దాం” అంటూ తప్పించుకెళ్లేవాడట. చివరికి విష్ణు, తన తండ్రి మోహన్ బాబును రంగంలోకి దించాడట.

ఆ సందర్భంలో మోహన్ బాబు స్వయంగా ప్రభాస్ వద్దకి వెళ్లి పారితోషకంపై ప్రస్తావించగా, ప్రభాస్ తనకున్న క్లోజ్ బాండింగ్ తో సరదాగా రఫ్ రిప్లై ఇచ్చాడట. ‘‘ఈ విషయం మరోసారి ఎత్తితే విష్ణును చంపేస్తాను’’ అంటూ జోకింగ్ స్టైల్‌లో ఘనంగా స్పందించాడట. ఇంతటి స్టార్ అయినా కూడా మోహన్ బాబుపై ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న స్నేహం కోసమే తనవంతుగా సహాయం చేయాలని ప్రభాస్ నిర్ణయించాడన్నది విష్ణు మాట. ఇది కేవలం పాత్ర పరిమితంగా కాకుండా మానవత్వ పరంగా కూడా ప్రభాస్ గొప్పదనాన్ని చూపించిందని ఆయన భావించారు.

అలాగే మోహన్ లాల్ కూడా అదే తరహాలో స్పందించారని విష్ణు తెలిపారు. రెమ్యూనరేషన్ విషయంపై ప్రస్తావించగానే ‘‘నాకు డబ్బులిచ్చేంత పెద్దవాడివి అయిపోయావా?’’ అంటూ ఫోన్‌లో తిట్టినట్లు చెప్పాడు. ఇది ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకం, మంచు కుటుంబంతో ఉన్న సంబంధమే కాకుండా వారి మధ్య ఉన్న గౌరవానికి నిదర్శనమని చెప్పాలి. ఇక బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాత్రం తన స్థాయికి తక్కువ పారితోషకమే తీసుకున్నప్పటికీ, ప్రాజెక్ట్‌పై ఆసక్తితో నటించారని విష్ణు వివరించారు. ఈ వివరాలు అన్నీ చూస్తే కన్నప్ప పట్ల పరిశ్రమలో ఉన్న గౌరవం, మద్దతు ఎంత ఉందో అర్థమవుతోంది.