Prabhas : పెళ్లి ఎపుడు అని యాంకర్ అడిగిన ప్రశ్న కు ప్రభాస్ ఏంటి అలా చెప్పేసాడు…!

Prabhas : బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు.అమ్మాయిల ఫేవరెట్ హీరో గా మారిపోయి,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్నాడు.ప్రభాస్ తో పాటు వున్న చాలా మంది యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసికొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు.ఇపుడు ప్రభాస్ వయసు కూడా నాలుగు పదులు దాటింది, కానీ ఇప్పటికి పెళ్లి గురించి ఏమి మాట్లాడటం లేదు.ఒకవైపు అభిమానులు పెళ్లి గురించిన గుడ్ న్యూస్ ఎపుడు చెప్తారో అని ఎదురుచూస్తున్నారు.

మొదట్లో బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో వాళ్లకి మాట ఇచ్చాడట ప్రభాస్. బాహుబలి సినిమా విడుదల అయ్యి చాలా ఏళ్ళు అవుతున్నా ఇంకా పెళ్లి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఒకసారి భీమవరం అమ్మాయితో పెళ్లి గురించి వార్తలు వినిపించాయి కానీ అవేవి జరగలేదు.ఇక ఈమధ్య ప్రభాస్ కుటుంబాన్ని మీడియా పెళ్లి గురించి ప్రశ్నించగా మేము కూడా అభిమానులులాగే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పడం ఆసక్తిని పెంచుతోంది.

ఇది ఇలా ఉండగా ఈ మధ్య ఒక ఆంగ్ల మీడియా తో మాట్లాడిన ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు కదా.. ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా అని ప్రభాస్ ని ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ. నా వివాహం గురించి ప్రేక్షకులు అడిగితే అసలు ఫీల్ అవ్వను అని నా పెళ్లి గురించి వాళ్లు ఆందోళన పడుతున్నారు అని అర్థం చేసుకుంటాను అని తెలిపారు ప్రభాస్. అంతేకాకుండా ఈ చాలా సింపుల్ ప్రశ్న.. ఎందుకంటె నేను వారి స్థానంలో ఉన్నా కూడా ఇలాగే ఆందోళనపడేవాడిన అని స్పష్టం చేశాడు ప్రభాస్. వెంటనే సదరు యాంకర్ ప్రశ్నిస్తూ మీరు పెళ్లి పలానా టైం లో చేసుకోవాలని ఏమైనా అనుకున్నారా అని అడగగా.. ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు తప్పకుండా పెళ్లిని ప్రకటిస్తానని ఆసక్తికరంగా సమాధానం చెప్పాడు ప్రభాస్. దీన్ని బట్టి ఈ ఏడాది కూడా పెళ్లి కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది.