ప్రభాస్, మారుతి.. ఎంతవరకు వచ్చింది?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేచురల్ హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరిగింది. అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన రెండో సెట్ లో మూడ్రోజుల పాటు సాగిన చిత్రీకరణ నిన్నటితో పూర్తి అయింది. 18 రోజుల పాటు ప్రభాస్ ఈ సినిమాపై వర్క్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 20 శాతం టారీ షూట్ పూర్తయింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. షూటింగ్ కు ఎక్కవ సమయం పడుతున్నందున.. ఈ చత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడదలయ్యే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం ఇంకా ఈ విషయాన్ని తెలపలేదు. అలాగే షూటింగ్ కు సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే సత్యరాజ్ ఈ సినిమాలో ప్రభాస్ కు తాతగా కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎప్పుడూ పాన్ ఇండియా చిత్రాలతో జోరు చూపిస్తున్న ప్రభాస్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సనిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాగే ఈ సినిమాకు ప్రభాసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదని.. వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారట. ఈ చిత్రాన్ని రూ.50 కోట్లో లేపు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి అరడజన్ సినిమాలు కన్ఫార్మ్ చేసిన ఈయన.. అన్నీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. వీటన్నిటిని రాబోయే మూడేళ్లలో విడుదల చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు ప్రభాస్.