పుష్ప కోసం పవర్ఫుల్ విలన్.. మళ్ళీ అతనే!

pushpa

RRR తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్న సినిమా పుష్ప. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా  రోజుకో రూమర్ వైరల్ మారుతోంది. ముఖ్యంగా సినిమాలో విలన్ పై ఇప్పటి వరకు వంద రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. 

అయితే రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా చిత్ర యూనిట్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్ తో ముందుకు సాగుతోంది. అయితే నెక్స్ట్ షెడ్యూల్ కోసం విలన్ పాత్ర అవసరం పడుతుండడంతో ఆ విషయంలో ఎదో ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయ్యారట. ఇక విలన్ పాత్ర విషయంలో ఆలస్యం చేయకూడదని పవర్ఫుల్ ఆర్టిస్ట్ కోసం వెతికే పనిలో పడ్డట్లు సమాచారం.

ARYA

ఇక పదేళ్ల క్రితం వరుడు సినిమాలో విలన్ గా ఇరగదీసిన కోలీవుడ్ నటుడు ఆర్యను ఫైనల్ చేసే అవకాశం ఉందట. వరుడు సినిమా ప్లాప్ అయినప్పటికీ అందులో విలన్ పాత్ర ఇంట్రడక్షన్ తోనే ఆర్య సూపర్బ్ అనిపించాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో హీరోగా అడుగులు వేస్తున్న ఆర్యను మళ్ళీ బన్నీ విలన్ గా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.