రెమ్యునరేషన్.. సమంత పవర్ఫుల్ కామెంట్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత. ఈ బ్యూటీ గతి ఏడాది యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో గత ఏడాది సమంత మయోసైటిస్ బారినపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. లైఫ్ లో సీరియస్ కండిషన్ ని ఫేస్ చేసింది. శారీరకంగా బలహీనమైన కూడా మానసికంగా ఆమె ధైర్యం తిరిగి కోలుకునేలా చేసింది.

ఇక సమంతలో ఉన్న ఆ ధైర్యం, తెగింపు స్టార్ హీరోయిన్ గా ఆమెను మరింతగా ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాయి.. యశోద సినిమాతో షోలోగా 50 కోట్ల కలెక్షన్ క్లబ్ లో సమంత చేరిపోయింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 14న ఆమె నటించిన మైథిలాజికల్ లవ్ స్టోరీ శాకుంతలం మూవీ రిలీజ్ రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో సమంత ఇప్పుడు బిజీగా ఉంది.

ఇండియన్ వైడ్ గా శాకుంతలం సినిమాని గ్రాండ్ గా ప్రేక్షకులకు రీచ్ చేయడం కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో సమంత ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన రెమ్యూనరేషన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తనేంటో, సినిమా కోసం తాను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అనేది చూసిన తర్వాత ఎవరైనా తనకు సరిపోయే రెమ్యూనరేషన్ కచ్చితంగా ఇస్తారని చెప్పింది. రెమ్యూనరేషన్ కోసం ఎవరిని తాను ఎవరిని అడుక్కొనని, తన హార్డ్ వర్క్ తన రేటు డిసైడ్ చేస్తుందని, నిర్మాతలు కూడా ఇప్పటివరకు అలాగే ఇస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనకు ఎంత ఇవ్వాలి అనేది తన వర్క్ చూసి నిర్మాతలు డిసైడ్ చేస్తారని చెప్పింది.

అలాగే తన కష్ట కాలంలో కూడా ప్రస్తుతం సినిమాలు చేస్తున్న నిర్మాతలు చాలా సహకరించారని చెప్పింది. తన అనారోగ్య సమస్యను అర్థం చేసుకొని సినిమా షూటింగ్ వాయిదా వేశారని పేర్కొంది. ఇక లైఫ్ లో ప్రతిరోజు ఒకే విధంగా ఉంటుందని ఆశ పడుతూ ఉండకూడదని చెప్పింది. ప్రతిరోజు డిఫరెంట్ గా ఉంటుందని, ఆయన కూడా జీవితాన్ని బెటర్ గా ముందుకు సాగించాల్సిందే అంటూ తన వ్యక్తిత్వాన్ని సమంత రిప్రజెంట్ చేసింది.