వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న వివాదాస్పద, సంచలనాత్మక చిత్రం.. పవర్ స్టార్ – ఎన్నికల ఫలితాల తర్వాత కథ. టైటిల్ చూస్తేనే అర్ధమవుతోంది ఈసారి వర్మ ఎవరిని టార్గెట్ చేశారో అనేది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రోజుకో పోస్టర్, ఇటీవల గడ్డితింటావా సాంగ్‌తో సినీ వర్గాల్లో రచ్చ లేపిన రాము, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఓ రేంజ్‌లో టీజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా విడుదల అయిన పవర్ స్టార్ మూవీ ట్రైరల్ అరాచకం సృష్టిస్తోంది. మొదట ట్రైలర్‌కు 25 రూపాయలు వసూలు చేయాలనుకున్న ఆర్జీవీకి షాక్ తగలింది. అనూహ్యంగా పవర్ స్టార్ ట్రైలర్ లీక్ అవడం, వెంటనే వైరల్ అవడం కూడా జరిగిపోయింది. దీంతో షాక్ తిన్న వర్మ చేసేదేం లేక, తన సినిమా ట్రైలర్ లీకైందని దీంతో పవర్ స్టార్ మూవీ ట్రైలర్‌ను వీక్షించేందుకు డబ్బు చెల్లించిన వారికి, ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీ పై సెటైరికల్‌గా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే, వర్మ అరాచకమే సృష్టించాడనిపిస్తోంది. ట్రైలర్‌లో పవన్ ఓ స్తంభాన్ని గ్లాస్‌తో సుతారంగా కొట్టడం, ఎన్నికల ఫలితాల నేపధ్యంలో, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడంతో, పవన్ ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, ఒక్క స్పీచ్ కూడా వర్కవుట్ కాలేదని, దర్శకుడిని కొట్టడం, అరాచకమే అనాలి.
ఇక ఆ తర్వాత చంద్రబాబు పాత్ర ఎంట్రీ.. మిమ్మల్ని నమ్మొద్దు, నమ్మొద్దు అని చాలా మంచి చెప్పారని, మీకో దండం సామి, ఫ్లీజ్ సార్ బయల్దేరండి అంటూ చంద్రాబాబుకు నమస్కారం చేసి, ప్లీజ్ సర్ బయలుదేరండి అని బయటికి దారి చూపిస్తూ.. బాబు పై పవన్ అసహనం వ్యక్తం చేయండం ఈ ట్రైలర్‌లో మరో రచ్చ సీన్ అని చెప్పాలి. ఇక చిరంజీవి, నాగబాబు, రష్యన్ భార్య, ఇలా మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ట్రైలర్‌లో నింపేశాడు వర్మ. ఇక ఫూణే నుంచి ఫోన్ రావడం మరో ట్విస్ట్.
సినీ క్రిటిక్ మహేష్ కత్తి పాత్ర కూడా సందర్భోచితంగా తీసుకురావడం, జర్నలిస్టుగా పవన్‌ను ఆయన ఏం ప్రశ్నిస్తారో, జనాన్ని పవన్ ఎందుకు తిట్టారో అనేవి చాలా ఇంట్రస్టింగ్‌గానే ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోవాలని హార్డ్‌కోర్ ఫ్యాన్ బండ్లగణేష్ పూజలు, ఇలా చెప్పుకుంటూపోతే, దాదాపు మొత్తం సినిమానే చూపించినంత పని చేశారు ఆర్జీవీ. మరి నాలుగు నిముషాల ట్రైలర్‌లోనే ఇంత అరాచకం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, మొత్తం సినిమాలో ఇంకెన్ని సంచలనాలు నింపాడో చూడాలి. ఏది ఏమైనా ఆర్జీవీ తనకు మాత్రమే సాధ్యమైన అరాచకంతో పవన్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.