పవర్ ప్లే ట్రైలర్ టాక్ : లిప్ లాక్స్ తో హైప్ పెంచేసిన రాజ్ తరుణ్ !

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు చేసుకున్న హీరో రాజ్ తరుణ్.ఈ హ్యాట్రిక్ విజయాలతో తర్వాత కుర్ర హీరో స్టోరీ సెలక్షన్ లో లోపాల వలన అతని సినిమాలు అయితే ఫ్లాప్ లేదంటే ఏవరేజ్ అనే రేంజ్ వరకే ఉంటున్నాయి. సినిమాలు ఎలా ఉన్నా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం వలన కుర్ర హీరో రాజ్ తరుణ్ ని అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘పవర్ ప్లే’. తాజాగా ‘పవర్ ప్లే’ ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే ఈ ట్రైలర్ ని కట్ చేశారు. ఒక్క డైలాగ్‌ లేకుండా సాగిపోయిన ఈ ట్రైలర్‌లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి ఇది రాజ్ తరుణ్ , కొండా విజయ్ కుమార్ ఇద్దరికీ కొత్త జోనర్ సినిమా అని చెప్పవచ్చు. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం.. ఐ. ఆండ్రీ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో హేమాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్ర పోషించింది. ఇందులో అజయ్ , కోట శ్రీనివాసరావు ,మధు , పూజా రామచంద్రన్ , ధనరాజ్ , వేణు తదితరులు నటించారు. ఈ చిత్రానికి నంద్యాల రవి స్టోరీ – డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా వుంటే రాజ్‌ తరుణ్‌ ఈసారి కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సీన్‌లో నటించి మరోసారి రెచ్చిపోయాడు. మరి ఈ పవర్‌ ప్లేలో చివరికి ఎవరు గెలిచారు, రాజ్‌ తరుణ్‌ తన కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లకు ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే.

https://youtu.be/MOuT8OjHHYc