పవన్ కళ్యాణ్ గురించి అభిమాని ఆవేదన.. లైక్ కొట్టిన పూనమ్ కౌర్

Poonam Kaur likes Fan tweet On Pawan kalyan

పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ అనే టాపిక్ ఎప్పుడూ చిక్కుతెగని భేతాళ ప్రశ్నే. పూనమ్ కౌర్ చేసే వ్యాఖ్యలు పెట్టే ట్వీట్లు ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినట్టుగా ఉంటాయి. ఇంకోసారి పవన్ కళ్యాణ్‌కు మద్దుతుగా ట్వీట్లు పెట్టినట్టు ఉంటాయి. కానీ పూనమ్ కౌర్ తన ఉద్దేశ్యం ఏంటనేది మాత్రం క్లియర్‌గా ఎప్పుడూ చెప్పింది లేదు. తనకు ఏది తోచితే అది చెబుతుంది. అదే ట్వీట్ చేస్తుంది. కానీ పూనమ్ కౌర్ వేసే ట్వీట్లపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు.

Poonam Kaur likes Fan tweet On Pawan kalyan
Poonam Kaur likes Fan tweet On Pawan kalyan

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లను పరోక్షంగా టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ వేసే ట్వీట్లు, వాటిపై వార్తలు రాసే మీడియాపై పూనమ్ చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్‌ను తిట్టిన వీడియోలు కనిపించినా కూడా పూనమ్ కౌర్ లైక్ కొడుతుంది.. పవన్ కళ్యాణ్‌ను పొగిడిన ట్వీట్లు కనిపించినా లైకులు కొడుతుంది. కానీ త్రివిక్రమ్‌ను మాత్రం ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. ఓ సారి ఏకంగా గురూజీ అని సంబోధిస్తూనే అసలు గుట్టంతా విప్పింది.

ఇప్పుడు మళ్లీ పూనమ్ కౌర్ ఓ ట్వీట్‌ను లైక్ చేసింది. అందులో ఓ అభిమాని హరీశ్ శంకర్‌ను విన్నవించుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ లేక ఫ్యాన్స్ బాధపడ్డం ఫ్లాప్ సినిమాతో బాధపడ్డాం.. హరీశ్ శంకర్ సర్.. ప్లీజ్ మీ సినిమాతో మా ఫ్యాన్స్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి కంపల్సరీగా ప్లీజ్.. అంటూ హరీశ్ శంకర్‌ను వేడుకున్నాడు. ఇదే ట్వీట్‌ను పూనమ్ కౌర్ లైక్ చేసేసింది. మరి పూనమ్ కూడా అదే ఫీలింగ్‌లో ఉందన్నమాట. ఏది ఏమైనా పూనమ్ కౌర్ చేష్టలు ఎప్పటికీ అర్థం కావు.