బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీగా రచ్చ చేసింది. అయితే ఉన్న కొన్ని రోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. యోగాలు, వర్కవుట్లు చేస్తూ ఫిట్ నెస్‌పై తనకు ఎంత శ్రద్ద ఉందో చెప్పేసింది. తమది ఆర్మీ ఫ్యామిలీ అని అందుకే ఇంతలా క్రమశిక్షణ, ఫిటెనెస్‌పై చిన్నతనం నుంచి అవగాహన కల్పించారని చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ రెండో సీజన్‌లో మహిళల కంటెస్టెంట్లలో టాస్కులో ఆడాలంటే పూజా రామచంద్రన్ తరువాతే ఎవ్వరైనా అని చెప్పుకునేంతలా ఆడింది.
అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ మొదట్లో కౌశల్‌తో బాగానే ఉంది. ఆ తరువాత కొన్ని గొడవలు జరగడంతో అలా మధ్యలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. బిగ్ బాస్ షోలో వల్ల పూజా రామచంద్రన్‌కు అంతగా అవకాశాలేవీ కూడా రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది. అలా బిగ్ బాస్ ఇంట్లో వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియాలో పెరిగిన ఫాలోయింగ్‌ను కాపాడుకుంటూ వస్తోంది. హాట్ హాట్ ఫోటోలు, బికినీలోఅందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది.
తాజాగా పూజా రామచంద్రన్ ఓ కొటేషన్ చెబుతూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో మందు గ్లాసును చేతిలో పట్టుకుని పోజిచ్చింది. ఎవరైనా నీ గురించి చెబితే.. నీ గురించి ఓ అంచనాకు వస్తే.. రానివ్వు.. అది వారి ప్రాబ్లమ్.. కానీ వారు చెప్పిన దాన్ని నువ్ అంగీకరించాల్సిన అవసరం లేదంటూ ఓ కొటేషన్‌ను పూజా రామచంద్రన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆమె తన భర్త్ జాన్‌తో కలిసి వేసే యోగాసనాలు వైరల్ అవుతుంటాయి.