ఒక్కోసారి వెండితెర కంటే బుల్లితెరే ఎక్కువగా ఫేమస్ చేస్తూ ఉంటుంది. పైగా బుల్లితెర షోలు, రియాల్టీ షోలు అయితే ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తాయి. అలా పూజా రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాల్లో మంచి పాత్రతో మెప్పించినా.. పూజా రామచంద్రన్ మాత్రం బిగ్ బాస్ షోతోనే ఎక్కువగా గుర్తుపడుతుంటారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రెండో సీజన్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ రచ్చ రచ్చ చేసింది.
రెండో సీజన్‌లో లేడీ వారియర్‌గా మగ కంటెస్టెంట్లతో ధీటుగా టాస్కుల్లో పార్టిసిపేట్ చేసింది. మాటలో అయినా చేతల్లో అయినా పూజా ఏ మాత్రం తగ్గేది కాదు. అయితే ఆమె గొంతు ఎత్తడం, చీటికిమాటికి నోరు పారేసుకోవడం, కౌశల్‌కు వ్యతిరేకంగా మారడం వంటి విషయాలతో మధ్యలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే షో నుంచి బయటకు వచ్చాక పూజకు బాగానే ఫాలోయింగ్ పెరిగింది. సినీ అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇక సోషల్ మీడియాలో పూజా తన భర్తతో చేసే విన్యాసాలు, ఫోటోలు చూస్తూంటే ఎవ్వరికైనా సరే మతిపోవాల్సిందే. భర్తతో కలిసి బీచ్‌ల వెంట తిరుగుతూ బికినీలతో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా ఇంటి పట్టునే ఉంటూ భార్యభర్తలిద్దరూ యోగాలు, వ్యాయమాలు చేస్తున్నారు. తాజాగా వారి గార్డెన్‌లో ఉన్న పక్షులతో పూజ ఆడుకుంది. మొదటగా వాటిని చూస్తేనే ఆమడ దూరం పరుగెత్తిందట. కానీ వాటిని మచ్చిక చేసుకున్నాక అవి వెంటే తిరగడం ప్రారంభించాయట. చుట్టూ తిరుగుతూ.. చెప్పడానికి వీలులేని, రాయడానికి వీలుకాని చోట వాటి ముక్కుతో పొడిచాయి. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.