స్వామిరారా, లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా రామచంద్రన్.. బిగ్‌బాస్ రెండో సీజన్‌తో మరింతగా చేరువైంది. సినిమాలతో కంటే బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన పూజా రామచంద్రన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే అనవసరంగా అరవడం, హౌస్‌మేట్స్ అందరితో సరిగా కలవలేకపోవడంతో మధ్యలోనే వెనుదిరిగిపోవాల్సి వచ్చింది.
అయితే షోలో ఉన్నంత సేపు ఆమె చేసిన టాస్క్‌లు, స్కిన్ షో, వర్కౌట్లు, ఇలా ప్రతీ ఒక్కటి ప్రేక్షకుల మైండ్‌లో గుర్తుండిపోయింది. ప్రతీరోజూ ఉదయం వ్యాయామం చేయడం తనకు అలవాటు అని చెప్పడం, ఫిట్‌గా ఉండటం తనకిష్టమని చెప్పడం మనమంతా చూశాం. బయట కూడా అంతే. పూజా తన భర్తతో కలిసి యోగా, వ్యాయామం చేస్తూనే ఉంటుంది. ఆ మేరకు ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎంతగా వైరల్ అవుతాయో అందరికీ తెలిసిందే.
తన భర్త జాన్ కొక్కెన్‌తో కలిసి బీచ్‌లు, అడవులు, నేచర్ అంటూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ మధ్య భర్తతో కలిసి బికినీ ధరించి బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. తాజాగా ఇప్పుడు కర్ణాటకలో కూర్గ్ అడవుల్లో ఈ జంట సంచరిస్తోంది. పచ్చని అడవి, జలపాతాల అందాలను తనివి తీరా చూస్తూ మంత్ర ముగ్దులవుతున్నారు.