పూజా హెగ్దే ట్రిపుల్ ధమాకా.!

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలట.! ఔను, పూజా హెగ్దే కోసం మూడు సినిమాలు తెలుగునాట రెడీగా వున్నాయట.! అంటే, మళ్ళీ పూజా హెగ్దే దశ తిరగబోతోందన్నమాట తెలుగు సినీ పరిశ్రమలో.

‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకుంది పూజా హెగ్దే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఛాన్స్ కూడా పూజా హెగ్దేకి దూరమయ్యింది. అయితే, అవన్నీ గతం. మళ్ళీ కెరీర్‌ని జాగ్రత్తగా పూజా హెగ్దే డిజైన్ చేసుకుంటోందిట. తప్పదు, చేసుకోవాలి మరి.!

డేట్స్ పెర్‌ఫెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ, నిర్మాతలకు సంకేతాలు పంపుతుండడంతో, ఆమెతో సినిమాలకు మళ్ళీ దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. చిత్రమేంటంటే, వరుస సినిమాలతో బిజీగా వుండడం వల్ల శ్రీలీల వదులుకున్న రెండు సినిమాల్లో పూజా హెగ్దేకి ఛాన్స్ దక్కిందని అంటున్నారు.

మరోపక్క, శ్రీలీల వదిలేసుకున్న ఓ సినిమాలో రష్మిక మండన్న పేరుని పరిశీలిస్తున్నారట. ఔను మరి, శ్రీలీల మాత్రం.. ఎన్ని సినిమాలు ఒకేసారి చేయగలదు.? శ్రీలీల ఫాలోయింగ్ ఎంతలా పెరిగిపోయినా.. ఒకేసారి అన్ని సినిమాలు ఆమె చేయలేదన్న విషయాన్ని నిర్మాతలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారన్నమాట.

ఇంతకీ, పూజా హెగ్దే చేతిలో పడ్డ ఆ సినిమాలు ఏంటబ్బా.? వచ్చే నెల మొదటి వారంలో పూర్తి స్పష్టత రానుందట.