ప్రస్తుతం పూజా హెగ్డే సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది ప్రేక్షకులకు కేవలం నా నడుము చూపిస్తే చాలు.. వారు నన్ను పొట్టి బట్టల్లోనే చూడాలనుకుంటున్నారు అంటూ ఏవేవో పిచ్చిగా మాట్లాడింది. మొత్తానికి దక్షిణాది ప్రేక్షకులకు టేస్ట్ లేదని, మనం కేవలం స్కిన్ షోనే కోరుకుంటామని అర్థం వచ్చేట్టుగా పూజా హెగ్డే సంచలన కామెంట్స్ చేసింది.
అన్నం పెట్టిన ఇండస్ట్రీని.. ఇప్పుడు నువ్ ఎంజాయ్ చేస్తున్న ఫేమ్, క్రేజ్, నేమ్ ఇచ్చిన ఇండస్ట్రీ గురించి అలా మాట్లాడతావా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలవైకుంఠపురములో సినిమాలో తన కాళ్లపైనే ఫోకస్ పెట్టారంటూ కామెడీ నవ్వుతూ చెప్పేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా హెగ్డేను ఏకిపారేస్తున్న సంగతి తెలిసి ట్వీట్ చేసిందో ఏమో గానీ త్రివిక్రమ్‌ని, అల వైకుంఠపురములో చిత్రాన్ని మోసేస్తూ ట్వీట్ చేసింది.
నేడు (నవంబర్ 6) త్రివిక్రమ్ బర్త్ డే. తాజాగా పూజా హెగ్డే ట్వీట్ చేస్తూ.. ‘కూల్‌గా ఉండే.. నిశ్శబ్దంగా ఉండే.. మోస్ట్ చార్మింగ్ త్రివిక్రమ్ సర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ అరవింద, అమూల్యగా నేను వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు అల వైకుంఠపురములో సినిమా గురించి నెరేట్ చేసినప్పుడు మనం ఎంత నవ్వుకున్నామో ఇప్పటికీ గుర్తుంది.. మీకు ఎప్పుడూ మంచే జరగాలి.. నేను మాత్రం ఒక్కటే చెప్పగలను.. గురూజీ సర్ గురూజీ అంతే’ అని మొత్తానికి ఇక్కడి వారికి వెన్నపూసినట్టు కనిపిస్తోంది.