పూజా హెగ్డే స్థానంలో.. ఆ ముగ్గురిలో ఒకరు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు. సెకండ్ లీడ్ కోసం శ్రీలీలని ఎంపిక చేశారు. రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరిగింది. తరువాత ప్రాజెక్ట్ ముందుకి కదలలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని పూర్తిగా మార్చేసాడంట.

అలాగే మూవీలో శ్రీలీల మాత్రం ఒక హీరోయిన్ గా ఉంటుంది. అయితే పూజా హెగ్డే ప్లేస్ మాత్రం పోయింది. ఆమెని ఈ మూవీ నుంచి తప్పించారనే ప్రచారం నడుస్తోంది. అలాగే ఆమెనే తప్పుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇందులో ఏది వాస్తవమో తెలియదు కాని మహేష్ కి జోడీగా పూజా హెగ్డే అయితే మాత్రం కనిపించదు అని ఒక క్లారిటీ వచ్చేసింది.

పూజా స్థానంలో ఎవరిని హీరోయిన్ గా తీసుకోవాలనే అంశంపై ప్రస్తుతం త్రివిక్రమ్ దృష్టి పెట్టినట్లు టాక్. అందులో భాగంగా ముగ్గురు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విరూపాక్ష మూవీతో సూపర్ హిట్ అందుకున్న సంయుక్తా మీనన్ ని ట్రై చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారంట. సంయుక్తని తెలుగులోకి తీసుకొచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు టాక్.

అలాగే జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పేరు కూడా వినిపిస్తోంది. హైట్ విషయంలో మహేష్ ని ఆమె మ్యాచ్ చేస్తుంది. లుక్స్ పరంగా కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే ఆమెని కూడా అనుకుంటున్నా రంట. అలాగే నిధి అగర్వాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లులో పవన్ కి జోడీగా నిధి నటిస్తోంది. అలాగే రాజా డీలాక్స్ లో ప్రభాస్ తో జత కట్టింది. మహేష్ కోసం ఆమెని తీసుకుంటే గ్లామర్ పరంగా బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు టాక్.

వీరి ముగ్గురిలో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. జూన్ 25 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేసింది కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.