ట్విన్సుగా పూజా హెగ్డే!?

Pooja Hegde
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ  సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే డ్యూయెల్ రోల్ అట. అది కూడా  ట్విన్సుగానట.  
 
Pooja Hegde
 
ఇక ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందని చెబుతున్నారు. అన్నట్టు  ఆ మధ్య విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో కూడా పూజా 90ల నాటి ట్రెడిషినల్ గెటప్ లోనే కనిపించింది.
 
మరి పూజా డబుల్ రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన  పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో నవంబర్ నుండి షూట్ చేయనున్నారట.   మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.