Pavan Kalyan : భవదీయుడు భగత్ సింగ్ కోసం ఆ హీరోయిన్ ను తీసుకున్నారు…మరో ఇద్దరు ముద్దుగుమ్మల కోసం అన్వేషణ…!

 

Pavan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు వెళ్ళేలోపు వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత ప్రజాక్షేత్రం లోకి వెళ్లాలనుకుంటున్నారు.ఇక అపుడే ఒప్పుకున్నా సినిమాలను చక చకా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హరి హర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తరువాత పవన్ భవదీయుడు భగత్ సింగ్ లో పాల్గొన బోతున్నారు.

భవదీయుడు కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసాడు హరీష్ శంకర్. ఇక సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండడంతో ఒక హీరోయిన్ గా పూజ హెగ్డే ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మరో ఇద్దరి కోసం హరీష్ వెతుకుతున్నారట. సినిమా టెక్నీషియన్స్, నటుల ఎంపిక అయ్యాక షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇక పవన్ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చాలా పెద్ద హిట్ అందులో కెవ్వు కేక సాంగ్ బాగా హిట్ అయింది.

ఇపుడు కూడా అలానే ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట హరీష్.ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ హాట్ ట్యూన్ ను కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఆ పాత్రలో హీరోయిన్ కనిపించాల్సిందే. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపిస్తారట. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే సన్నివేశాలు చాలా తాజాగా ఉంటాయట. హరీష్ శంకర్ తన సినిమాల్లో డైలాగ్స్, కామెడీ సన్నివేశాలను బాగా రాసుకుంటారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ లో ఓ స్టార్ హీరో కనిపిస్తారని వినిపిస్తోంది.