ముసల్దానిలా అవ్వాలని ఉంది.. ఆ వయసులో అలా ఉండాలి : పూజా హెగ్డే

Pooja Hegde shares adorable video of Grandmother Chit Chat

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతా యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే తెరపై ఎంత యాక్టివ్‌గా చలాకీగా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అంతే సరదాగా ఉంటుంది. సినీ విషయాలు, అప్డేట్లతో పాటు ముఖ్యంగా ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. లాక్డౌన్‌లో పూజా హెగ్డే చేసిన పోస్ట్‌లు, వంటింట్లో దూరి వండిన వంటకాలు, ఇంటి సభ్యులకు ప్రేమగా వడ్డించిన సందర్భాలెన్నో ఉన్నాయి.

Pooja Hegde shares adorable video of Grandmother Chit Chat
Pooja Hegde shares adorable video of Grandmother Chit Chat

ఓ సారి పూజా హెగ్డే స్వీట్ చేసింది..మరోసారి డిన్నర్ మొత్తం రెడీ చేసి ఫైవ్ స్టార్ హోటల్‌లొ సర్వ్ చేసినట్టుగా ఎంతో ప్రొఫెషనల్‌గా చేసింది. తండ్రి మందు తాగుతూ ఉంటే స్పెషల్ స్టఫ్ చేసి పెట్టింది. ఇలా ఎన్నో రకాలుగా పూజా సోషల్ మీడియాలో సందడిచేసింది. ఓసారి పూజా హెగ్డే తన అపార్ట్మెంట్‌లొని ఇంట్లోనే చిక్కుకుపోయింది. కిటికీలోంచి అరుస్తూ.. జడ పిన్నులతో డోర్‌ను తీసేందుకు చాలానే ప్రయత్నించారు. అలా పూజా హెగ్డే రోజూ ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూనే ఉండేది.

తాజాగా పూజా హెగ్డే ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అందులో తన నానమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. క్వీన్ ఎలిజబెత్.. మార్గరేట్ థాచర్ భేటీలో చాలానే ముచ్చటించుకున్నారని కౌంటర్లు వేసింది. నాక్కూడా ఆ వయసులోకి వెళ్లాలని ఉంది.. మనకు కూడా 85 ఏళ్లు వచ్చినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలని ఉంది.. అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. పూజా ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలతో బిజీగా ఉంది.