అలాంటివి వద్దంటోన్న పూజాహెగ్దే.!

ఓ మోస్తరు స్టార్‌డమ్ వచ్చినాకా హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఆయా హీరోయిన్ల స్టార్‌డమ్‌ని బేస్ చేసుకుని పలు లేడీ ఓరియెంటెడ్ స్టోరీలు రూపుదిద్దుకుంటుంటాయ్.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల ఆఫర్స్ వస్తే అందాల భామలు కూడా ఎగిరి గంతేస్తుంటారు. కానీ, బుట్టబొమ్మ పూజా హెగ్దే తన రూటే సెపరేటు అంటోంది. ఇప్పుడప్పుడే తనకు ఆ ఉద్దేశం లేదంటోంది. ఇటీవలే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆఫర్ పూజా హెగ్దే తలుపు తట్టిందట. అయితే, అందుకు పూజా హెగ్దే నో చెప్పేసిందట.

ఎందుకో కారణం తెలీదు కానీ, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తన ఒంటికి పడవంటూ వెనక్కి జరిగిపోతోంది పూజా హెగ్దే. ప్రస్తుతం పూజా హెగ్దే చేతిలో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబో మూవీలో నటిస్తోంది.

లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది పూజా హెగ్దే.