పవన్ సినిమాకి నువ్వు చెప్పి బాధపడుతున్న పూజా హెగ్డే… నో చెప్పడానికి అదే కారణమా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ విధంగా వరుస సినిమాలతోనూ మరోవైపు రాజకీయాలలో పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.ఈయనకు రాజకీయాలలో ఎప్పుడు ఖాళీగా ఉంటుందో అప్పుడే సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారని అతని సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలలో దర్శక నిర్మాతలు ఉన్నప్పటికీ కొత్త సినిమాలను ప్రకటిస్తూ ఉన్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రకటించారు. అదేవిధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించి ఈ విషయాన్ని తెలియజేశారు.

భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ముందుగా పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమె ఈ సినిమాకి నో చెప్పినట్లు సమాచారం.పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూ సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఆయనకు వీలున్నప్పుడే సినిమా షూటింగ్లో పాల్గొనడం వల్ల తన డేట్స్ క్లాష్ అవుతాయన్న కారణంతోనే పూజా హెగ్డే పవన్ సినిమాకు నో చెప్పినట్టు సమాచారం.