సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. కొందరు ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారి వరసగా భారీ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంటారు. కొందరు చిన్న చిన్న సినిమాలు చేసి మెల్లగా సక్సస్ లు అందుకొని ప్రేక్షకులని, మేకర్స్ ని ఆకట్టుకొని స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంటారు. ఇక ఒక్కసారి ఒక భాషలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అన్న క్రేజ్ వచ్చాక చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నా ఇంకో భాషలో ప్రయత్నాలు మొదలు పెట్టడం.. అక్కడ క్రేజీ హీరోయిన్ గా ఉన్న వాళ్ళకి పోటీ వెళ్ళడం సహజమే.
ఇప్పుడు అలాంటి పోటీ ఇవ్వడానికి పూజా హెగ్డే బాలీవుడ్ లో ట్రై చేస్తుందని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా పూజా హెగ్డే తెలుగులో ఒకేసారి రెండు సినిమాలు చేసి మేకర్స్ ని, ప్రేక్షకులని ఆకట్టుకున్నప్పటికి బాలీవుడ్ మీదున్న మోజుతో వచ్చిన తెలుగు సినిమా అవకాశాలు కూడా కాదనుకొని బాలీవుడ్ కి వెళ్ళింది. కాని అక్కడ చేసిన సినిమా భారీ డిజాస్టర్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ కే వచ్చి ఒక్కో సినిమా చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి రాధే శ్యామ్..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు చేస్తుంది.
ఇక ధోనీ సినిమాలో చేసిన కియారా అద్వానీ ఆ తర్వాత భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ చేసినప్పటికి ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ లో కియారా నటించిన లస్ట్ స్టోరీస్ అన్న వేబ్ సిరీస్ తో పాపులర్ కాగా ఆ తర్వాత నటించిన తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ తో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.
అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కియారాకి పోటీగా పూజా హెగ్డే దిగింది. టాలీవుడ్ లో బిజీగా ఉన్నాకూడా బాలీవుడ్ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలగాలన్న తపనతో వరసగా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రన్ వీర్ సింగ్ లాంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్న సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. అంతేకాదు పూజా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా అక్కడి మేకర్స్ ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. మొత్తానికి ఈ రకంగా పూజా హెగ్డే బాలీవుడ్ లో కియారా కి గట్టిపోటీ ఇస్తోంది.