1970 దశకంలో తండ్రి అంటే పిల్లలు భయపడి ఆమడ దూరంలో ఉండేవారు. అదే 1990 తర్వాత తండ్రికి పిల్లలు దగ్గరయినప్పటికీ చాల విషయాలు చర్చించుకోవడం కానీ కలిసి ఏదైనా పని చేయడం కానీ ఉండేది కాదు. మరీ ఆడపిల్లలైతే ఈ దూరం ఇంకొంచెం ఎక్కువుగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఆ దూరం తగ్గిపోయింది. అన్ని పనులు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి చేస్తున్నారు. ఈ జనరేషన్ పిల్లలకు వారి తల్లిదండ్రులే బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ గా వున్నారంటే తండ్రికి ఒక పెగ్గు కలిపించే అంత క్లోజ్ అయ్యారు.
ఈ విషయాలు అన్ని ఎందు చెప్పాల్సివచ్చిందంటే, తండ్రి పిల్లల మధ్య స్నేహం తెలియజేసే విషయం ఒకటి, స్టార్ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మనందరితో పంచుకోవడం జరిగింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు, మన తెలుగు వారికి బాగా పరిచయం వున్న పూజ హెగ్డే.
వీకెండ్ లో తన తండ్రికి ఒక పెగ్గు కలిపి ఇచ్చిందట హీరోయిన్ పూజ హెగ్డే. పెగ్గు ఇవ్వడమే కాదు, ఆ పెగ్గు ఎలా తాయారు చెయ్యాలో కూడా రెసిపీ కూడ పోస్ట్ చేసింది. ఎవరన్నా చేసుకోవాలన్న ఇంకెవరికన్నా పెగ్గు కలపాలన్న ఉపోయోగపడుతుందన్నమాట.