పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అలా పూజా హెగ్డే చేసే రచ్చకు నెటింట్లో తెగ హడావిడి జరుగుతూ ఉంటుంది. అల్లరి చేష్టలు ఎన్ని చేస్తుంటుందో.. వివాదాలకు అంతే స్థాయిలో తెర లేపుతూ ఉంటుంది. అలాంటి పూజా హెగ్డే తాజాగా నెటిజన్లతో ఓ ఆట ఆడింది. ఏ ఫోటోను అయినా అడగండి.. షేర్ చేస్తాను అంటూ పూజా హెగ్డే తన అభిమానులకు సవాల్ విసిరింది.
అయితే అలాంటి ఆఫర్లు ఇస్తే అభిమానులు ఊరికే ఊరుకుంటారా? అభిమానుల్లో కొందరు ఆకతాయిలు కూడా ఉంటారు. ఫోటోలు అడగమంటే ఎలాంటివి అడుగుతారో కూడా ఊహించుకోవచ్చు. అయితే కొందరు మాత్రం వాటిని చూసి కూడా చూడకుండా ఉన్నట్టు నటిస్తుంటారు. కొందరు లైట్ అంటూ అసలు రిప్లైనే ఇవ్వరు. ఇంకొందరు చాకచక్యంగా వాటికి తగిన సమయస్పూర్తితో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా పూజా హెగ్డే కూడా అదే పని చేసింది.
పూజా హెగ్డే నిన్న రాత్రి తన ఫాలోవర్లతో కాసేపు ముచ్చట్లు పెట్టింది. అందులో భాగంగా నెటిజన్లు అడిగిన ఫోటోలను ఆమె షేర్ చేస్తూ వచ్చింది. అందులో ఓ తుంటరి నెటిజన్ మాత్రంనగ్నం ఫోటో కావాలని అడిగేశాడు. దానికి పూజా హెగ్డే అదిరిపోయేలా ఆన్సర్ ఇచ్చింది. కాళ్ల ఫోటోను షేర్ చేసి.. చూసుకో నగ్నంగా ఉన్నాను.. ఇదే నగ్న ఫోటో అని చెప్పేసింది. దీంతో సదరు నెటిజన్‌కు దెబ్బకు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఎంతైనా మేడమ్ సార్ మేడమ్ అంతే అనే రేంజ్లో పూజా హెగ్డే కౌంటర్ ఇచ్చింది.