ఒక సినిమా హిట్టయితే ఇండస్ట్రీలో ఏ స్టార్ అయినా కూడా ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తాడు. హీరోయిన్స్ అయితే ఆ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటారు. హీరోయిన్స్ వరల్డ్ లో పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం అగ్ర హీరోయిన్ గా కొనసాగే గ్యారెంటీ ఉండదు. అందుకే ఛాన్స్ లు వచ్చినప్పుడే రెమ్యునరేషన్ తో ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. కానీ బుట్టబొమ్మ మాత్రం ఇటీవల ఒక దర్శకుడు చెప్పింది విని భారీ డిస్కౌంట్ ఇచ్చిందట.
ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా టాప్ రేటింగ్ తో కొనసాగుతున్న బ్యూటీ పూజా హగ్డే. గత కొంత కాలంగా ఆమెకు ఎదురేలేదు. పట్టిందాల్లా బంగారం అవుతోంది. సీనియర్ హీరోయిన్స్ హావా తగ్గడంతో అమ్మడు తన క్రేజ్ తో పెద్ద సినిమాల్లో ఛాన్సులు అందుకుంటోంది. ఇక ఆమె నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ అనే టాక్ కూడా వస్తోంది. అయితే ఇటీవల సడన్ గా ఒక తెలుగు దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన పూజా హెగ్డే రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదని ఒప్పేసుకుందట.
ఆ దర్శకుడు మరెవరో కాదు.. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్. మహాభారతం లోని ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ శాకుంతలం కథను సినిమాగా రూపొందించనున్న ఈ ఒక్కడు దర్శకుడు టైటిల్ రోల్ కోసం పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే దర్శకుడు ముందే ఆమెకు అడిగినంత ఇవ్వలేనని చెప్పాడట. 2కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న పూజా హెగ్డే సగం వరకు తగ్గించిందట. దర్శకుడు కథను చెప్పిన విధానం బట్టి తన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని పూజా రెమ్యునరేషన్ లో ఆ విదంగా డిస్కౌంట్ ఇచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి.