పవన్ కళ్యాణ్ కోసం పూజా హెగ్దే ఖాయమైపోయినట్టే.!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లాంఛనంగా ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తున్నారు.

ఇదిలా వుంటే, ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ని షూట్ చేయబోతున్నారట. ఆ స్పెషల్ సాంగ్‌తోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్నది తాజా ఖబర్. ఇక, ఈ స్పెషల్ సాంగ్ కోసం అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా, చివరికి పూజా హెగ్దే వద్ద ‘ఖాయమైనట్లు’ తెలుస్తోంది. పూజా హెగ్దే ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘ఎఫ్-3’ సినిమా కోసం, అంతకంటే ముందు ‘రంగస్థలం’ సినిమా కోసం స్పెషల్ సాంగ్స్ చేసేసింది పూజా హెగ్దే. సో, ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్ వుంటుంది. మరోపక్క, పవన్ కళ్యాణ్ ఇచ్చిన లిమిటెడ్ డేట్స్‌కి అనుగుణంగా షెడ్యూల్స్ డిజైన్ చేశారు. శరవేగంగా సినిమా నిర్మాణం పూర్తయిపోతుందిట.