డాక్టరైన యాక్టర్ తమ్ముడు.. ఆనందంలో పూజా హెగ్డే

Pooja Hegde about Her Brother Rishab Hegde

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. తెరపై ఎంతో చలాకీగా ఉండే పూజా.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటుంది. సినిమాలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. లాక్డౌన్ సమయంలో అయితే పూజా హెగ్డే చేసిన సందడి అంతా ఇంతా కాదు.

Pooja Hegde about Her Brother Rishab Hegde
Pooja Hegde about Her Brother Rishab Hegde

పూజా హెగ్డే తన ఫ్యామిలీ గురించి, వారు తనకు చేసే రాచమర్యాదల గురించి ఎన్నో చెప్పుకొచ్చింది. ఆ మధ్య ఓ వీడియోను షేర్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో పూజా హెగ్డేకు కజిన్స్ అందరూ కలిసి మసాజ్‌లు చేస్తుంటారు. కొందరు కాళ్లు పట్టుకుని, ఇంకొందరు చేతులు, మరొకరు తలకు ఇలా అన్నదమ్ములతో పూజా హెగ్డే సేవలు చేయించుకుంది. ఆ వీడియో ఆ మధ్య తెగ చక్కర్లు కొట్టేసింది. తాజాగా పూజా హెగ్డే తనతమ్ముడి విషయంలో ఆనందం వ్యక్తం చేసింది.

పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే డాక్టర్ అయ్యాడట. ఈ విషయాన్ని చెబుతూ అమ్మడు తెగ మురిసిపోతోంది. డాక్టర్ పట్టా పొందిన ఫోటోను షేర్ చేస్తూ అతనొక పుస్తకాల పురుగు అన్నట్టు చెప్పుకొచ్చింది. ఆర్థోపిడీక్ సర్జన్ అంటూ స్పెషలిస్ట్ డాక్టర్ అని తెలిపింది. మొత్తానికి ఇంట్లో ఓ యాక్టర్, ఓ డాక్టర్ ఉన్నారన్న మాట. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.