అల వైకుంఠపురములో సినిమా విడుదలై నేటికి సంవత్సరం అవుతోంది. ఈ సందర్భంగా యూనిట్ అంతా కూడా గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లెవెల్‌లో భారీ పార్టీని ఏర్పాటు చేశారు. ఇందులో బన్నీ, త్రివిక్రమ్, పూజా హెగ్డే, అల్లు ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. అలా ఈ ఈవెంట్‌లో ఎన్నో మ్యాజిక్ మూమెంట్స్ ఉన్నాయి. బన్నీపై త్రివిక్రమ్, త్రివిక్రమ్ అందరిపై కౌంటర్లు సెటైర్లు వేశాడు.
ఇక మళ్లీ ఇలా అందరూ కలిసి రచ్చ చేయడంతో సోషల్ మీడియా మొత్తం టాపిక్ అల వైకుంఠపురములో గురించే అవుతోంది. ఇలాంటి చర్చల మధ్యలో పూజా హెగ్డే చేసిన ఓ ఫన్నీ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతేడాది కూడా పూజా హెగ్డే లిఫ్ట్‌లో దిగిన ఓ ఫన్నీ పోస్ట్ చేసింది. సినిమాలో కూడా లిఫ్ట్ సీన్ ఉంటుంది.. అలా లిఫ్ట్ బాగానే కలిసి వచ్చిందనే ఉద్దేశ్యంలో పూజా ఓ పోస్ట్ చేసింది.
ఈ ఈవెంట్‌కు అందరూ కలిసి వెళ్లినట్టున్నారు. ఈ క్రమంలో సుశాంత్, శిరీష్, పూజా హెగ్డే, బన్నీ కలిసి అందరూ కలిసి ఒకేసారి లిఫ్ట్‌లో వెళ్లారు. ఈ క్రమంలో ఆ లిఫ్ట్ చాలా చిన్నదిగానే ఉంది. అందులో ఈ నలుగురు ఇరుగ్గానే నిల్చున్నారు. ఈ లిఫ్ట్ ఇలా మనల్ని ఇంకా దగ్గర చేసేస్తోందంటూ పూజా హెగ్డే సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అంతే కాకుండా బన్నీ కూడా పూజాను తన లక్కీ చార్మ్‌గా చెబుతూ ఓ పోస్ట్ చేశాడు. దీనికి పూజా బాగానే సిగ్గుపడినట్టుంది.