Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానుల పై పోలీస్ కేస్… హద్దులు దాటిన అభిమానం!

Pawan Kalyan:రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా చేసింది తక్కువ సినిమాలే ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కు విపరీతమైన క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. భారీ కటౌట్లు పెట్టడమే కాకుండా పాలాభిషేకాలు చేయడం వంటి అభిమానాన్ని చూసి ఉంటాం.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు 150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో అభిమానులు తమ అభిమాన నటుడి పట్ల ఉన్న అభిమానానికి హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల సమస్యలలో చిక్కుకున్నారు.

ఇప్పటివరకు అభిమాన హీరో సినిమాలు విడుదల అయితే పాలాభిషేకాలు చేయడం మనం చూశాం కానీ పవన్ కళ్యాణ్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన అభిమానులు ఏకంగా మేకను బలి ఇవ్వడంతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.జంతువులు, పక్షులు, బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1) (A), పీసీఏ 11(1) (a) కింద కూడా కేసు నమోదు చేసినట్లు అషర్ అనే న్యాయవాది ఈ విషయాలను వెల్లడిస్తూ మేకను బలి ఇచ్చే ఫోటోలను కూడా షేర్ చేశారు.