గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీని గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై కొరటాల శివ ఆవిష్కరించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీలో జన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు బడ్జెట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి ఈ మూవీ రాబోతోంది. అయితే ఎన్టీఆర్ నమ్మకంతో ఏడాది వెయిట్ చేసి కొరటాలతో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టు కునే విధంగా కొరటాల శివ ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారంట.
ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. వాటిని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నేతృత్వంలో ఈ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే దేవరలోని కీలకమైన యాక్షన్ ఘట్టాలు అన్ని కూడా కంప్లీట్ అయ్యాయని తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి టాకీ పార్ట్ స్టార్ట్ చేస్తారంట. స్టొరీ బోర్డు ముందుగానే వేసుకొని కచ్చితమిన ప్లాన్ తో మూవీ చేస్తూ ఉండటం వలన కొరటాల గత సినిమాలకి భిన్నంగా దేవర తెరకెక్కుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా కోసం బల్క్ డేట్స్ ఇవ్వడంతో గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో ఈ చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో కొరటాల శివ ఉన్నారు. ప్రస్తుతం అతను వేసుకున్న లెక్కల ప్రకారం అయితే నవంబర్ నాటికి మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ పై దృష్టి పెట్టనున్నారు.
ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆ టైమ్ కి సినిమాని పూర్తిగా సిద్ధం చేసి సాలిడ్ ప్రమోషన్స్ కి ఇంకా నెల రోజులు టైమ్ ఉండే విధంగా సినిమా కోసం కొరటాల ప్లాన్ వేసుకున్నారంట. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అతను కూడాసినిమా సాంగ్స్ వర్క్ స్టార్ట్ చేసేసినట్లు తెలుస్తోంది.