పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే హల్చల్ గురించి అందరికీ తెసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందు పాత్రలో జీవించి రెండు తెలుగు రాష్రాల్లోని యూత్‌ను ఆకట్టుకుంది. అయితే మళ్లీ ఆరేంజ్ క్యారెక్టర్ పడకపోయే సరికి కాస్త వెనకబడింది. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడంతో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తెరపై ఎంత రచ్చ చేస్తుందో సోషల్ మీడియాలో అంతకు పదింతలు రచ్చ చేస్తుంది.
ఈ మధ్యే పాయల్ హైద్రాబాద్‌కు మకాం మార్చేసింది. ఇక్కడే ప్రాజెక్ట్‌లు ఎక్కువగా ఉండటం షూటింగ్స్ ఇక్కడే ఉండటంతో హైద్రాబాద్‌లో సొంతిళ్లును కొనుక్కుంది. ఆ మధ్య రోడ్డుపైనే ఫోటో షూట్లు చేసి నానా రచ్చ చేసింది. మళ్లీ కరోనా పరీక్షలు చేస్తుంటే చిన్న పిల్లలా ఏడ్వడం, దానిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేయడం అందరికీ తెలిసిందే.తాను భయంతో ఏడిస్తే దారుణంగా ట్రోల్ చేస్తారా? ఇది న్యాయమా? అంటూ విరుచుకుపడింది.
తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆ సినిమాలో పాయల్ పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రను చేస్తోంది. పైగా తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. తాజాగా మేకప్ రూంలో రెడీ అవుతున్న ఫోటోను షేర్ చేసింది. మేకప్ మెన్స్ రెడీ చేస్తోంటే.. సెల్ఫీలు దిగుతూ బిజీగా ఉంది. ఏది ఏమైనా సరే ఫస్ట్ సెల్ఫీలు దిగాల్సిందే అంటూ మొహాన్ని మాత్రం చూపించను అంటూ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడింది.