ప్రయాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ ఘోష్. ఆపై కొన్ని చిత్రాలు చేసింది కూడా. అయితే ఊసరవెల్లి చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఈ భామ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ గొప్పదనం, బాలీవుడ్ చీకటి కోణాలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. నేడు ఏకంగా ఓ డైరెక్టర్ భాగోతాన్ని బయటపెట్టింది.
తనను ఓ డైరెక్టర్ బాగా గారాబం చేసేవాడని, ఆ చనువుతో ఓ రోజు రూమ్‌కి పిలిచి బ్లూ ఫిల్మ్ చూపించాడంటూ ఆ మధ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాయల్ ఘోష్.. ఆ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అని బహిరంగంగా చెప్పేసింది. అంతేకాదు ఆయన రూమ్‌కి పిలిచి చేసిన వికృత చేష్టలను బయటపెట్టింది. రూమ్‌లోకి తీసుకెళ్లి తన దుస్తులు విప్పేసి దారుణంగా ప్రవర్తించాడని, ఆ సందర్భం వర్ణించలేనిదంటూ ఆవేదన చెందింది.
ఇక ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీకి విన్నవించుకుంటూ ఆయన కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. దయచేసి అతని ముసుగు వెనుక ఉన్న రాక్షసుడిని దేశానికి చూపించండి. ఇది నాకు హాని కలిగిస్తుందని, నా భద్రతకు ప్రమాదమని తెలుసు. దయచేసి అతనిపై వెంటనే చర్యలు తీసుకుని సాయం అందించండని పాయల్ కోరుకుంది. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.