టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నటించిన లేటెస్ట్ చిత్రాల్లో రెండు స్ట్రైట్ చిత్రాలు సహా ఓ రీమేక్ చిత్రం ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో అయితే పవన్ కి బాగా నచ్చి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే మాత్రం అది డెఫినెట్ గా భారీ చిత్రం “ఓజి” అనే అంటున్నారు.
ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ లో చాలా సమయం నటించగా ఇప్పుడు బ్రేక్ లో ఉంది. ఇక ఈ గ్యాప్ లో అయితే పవన్ లేని పలు పవర్ ఫుల్ సీక్వెన్స్ లు అయితే యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. మరి ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ సినిమా కోసం క్రేజీ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.
దీనితో పవన్ మరోసారి కొన్ని డేట్స్ ని కేటాయించారట. దీనితో మళ్ళీ ఈ సినిమా షూట్ దాదాపు అక్టోబర్ నెలలో స్టార్ట్ కావచ్చని ఇప్పుడు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షూట్ లు విదేశాల్లో తెరకెక్కిస్తున్నారని కూడా రూమర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఇది ఒక కంప్లీట్ మార్షల్ ఏక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా కాగా అందుకు తగ్గ లొకేషన్స్ ని ఇపుడు సుజీత్ అండ్ టీం చూస్తున్నారట.
ప్రస్తుతం బ్యాంగ్ కాక్ లో లొకేషన్ ని టీం ఫైనల్ చేస్తున్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ చిత్రం ఇదే అక్టోబర్ లో పవన్ తన రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందని రూమర్స్ ఉన్నాయి. మొత్తానికి అయితే అక్టోబర్ నెల అంతా పవన్ ఫుల్ బిజీ బిజీ ఉండనున్నాడు అని చెప్పాలి. ఇంకా ఉస్తాద్ ని అయితే హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా వీరమల్లు సినిమా కోసం మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.