లేటెస్ట్ : “ఓజి” సెట్స్ లో అడుగు పెట్టిన పవర్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో దాని తాలూకా హైప్ ఏ లెవెల్లో ఉంటుందో అనేది ఇప్పుడు అయితే యంగ్ దర్శకుడు సుజీత్ తో ప్లాన్ చేసిన భారీ చిత్రం “ఓజి” తో ఇప్పుడు తెలుస్తుంది. కాగా ఈ షూటింగ్ ని మేకర్స్ మొన్ననే మొదలు పెట్టగ దీనితో అనౌన్స్ చేసిన వీడియోకి క్రేజీ రెస్పాన్స్ కూడా వచ్చింది.

అంతే కాకుండా పవన్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. అయ్యితే ఈరోజు చిత్ర యూనిట్ మరి బిగ్ అప్డేట్ ని అయితే అందించారు. మరి ఈరోజే పవర్ స్టార్ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యినట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మొదటగా ఓ యాక్షన్ పోస్టర్ ని రిలీజ్ చేయగా నెక్స్ట్ అయితే పవన్ నుంచి ఇంట్రెస్టింగ్ స్టిల్ రిలీజ్ చేసి షూటింగ్ లో పవర్ స్టార్ జాయిన్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఈ సాలిడ్ అప్డేట్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహంగా మార్చింది. ఇక ఈ భారీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ షూటింగ్ కొన్ని రోజులు పాటు జరగనుంది. దీని తర్వాత పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇక ఇక ఓజి ని అయితే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.