డ‌బ్బింగ్ మొద‌లు పెట్టిన వ‌కీల్ సాబ్‌.. టీజ‌ర్‌తో ర‌చ్చ చేసేందుకు రెడీ

రెండేళ్ళ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ని లైన్‌లో పెట్టేశాడు. పింక్ రీమేక్గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో పాటు హ‌రీష్ శంక‌ర్ లో ఓ మూవీ, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ, సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా మ‌ధ్య‌లోనే నిలిచిపోయింది. ఏడు నెలల విరామం తరువాత మళ్లీ వకీల్ సాబ్ సెట్‌లోకి అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. స‌రూర్‌నగర్‌లోని ఓ పాఠశాలలో వేసిన కోర్టు సెట్‌లో షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో పవన్‌ కల్యాణ్‌తో పాటు హీరోయిన్లు అంజలి, నివేథా థామస్‌, అనన్యలు పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. ఇంకో వారంపాటు ఈ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరగనున్నట్లు సమాచారం

శృతి హాస‌న్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నుండ‌గా, ఆమె ఈ నెలాఖ‌రులో టీంతో జాయిన్ కానుంది. హిందీ వెర్షన్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, ఈ మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.ఇప్ప‌టికే మూవీకి సంబంధించిన వీడియో ఒక‌టి విడుద‌ల కాగా, ఇది వైబ్రేష‌న్స్ క్రియేట్ చేసింది.

అయితే వ‌కీల్ సాబ్ మూవీ టీజ‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ దీపావ‌ళికి టీజ‌ర్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ డబ్బింగ్ షురూ చేశారు. డ‌బ్బింగ్ స్టూడియోలో ప‌వ‌న్ దిగిన ఫోటోలు బ‌య‌ట‌కు రాగా, ఇందులో ప‌వ‌న్ లుక్ చూసి అభిమానులు మురిసిపోయారు. మొన్న‌టి వ‌ర‌కు గుబురు గెడ్డంతో ర‌ఫ్ లుక్ లో క‌నిపించిన ప‌వ‌న్ ఒక్క‌సారిగా స్మార్ట్‌గా క‌నిపించే స‌రికి ఆయ‌న ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పవ‌న్ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ వ‌చ్చిన సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు